కేపీఆర్ కొడుకు, కోడలిని ఆశీర్వదించిన సునీతమ్మ
తాండూరు, దర్శని ప్రతినిధి : టీఆర్ఎస్ రాష్ట్ర సీనీయర్ నాయకులు, యాలాల మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావు(కేపీఆర్) కుమారుడు అనిరుధ్ భరద్వాజ్, కోడలు రాధికలను వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితారెడ్డి ఆశీర్వదించారు. శనివారం మెడ్చల్‌లో కరణం పురుషోత్తంరావు కుమారుడు అనిరుధ్ భరద్వాజ్, కోడలు రాధికలు పెండ్లిరోజుతో పాటు రాధికకు శ్రీమంతం వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునితారెడ్డి హాజరయ్యారు. పెండ్లి రోజు జరుపుకున్న దంపతులకు, శ్రీమంతం చేసుకున్న రాధికకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ శుభాకార్యానికి సునీతమ్మ రావడంతో సందడి వాతారణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కరణం పురుషోత్తంరావుతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
