సెల్ ట‌వ‌ర్ నిర్మాణ ప‌నుల‌ను ఆపేయండి

తాండూరు

సెల్ ట‌వ‌ర్ నిర్మాణ ప‌నుల‌ను ఆపేయండి
– బీజేపీ కౌన్సిర‌ల్ సంగీత ఠాకూర్
తాండూరు, ద‌ర్శ‌ని ప్ర‌తినిధి : తాండూరు ప‌ట్ట‌ణంలో నిర్మాణం చేప‌డుతున్న జియో సెల్ ట‌వ‌ర్ ప‌నుల‌ను ఆపేయాల‌ని మున్సిప‌ల్ బీజేపీ కౌన్సిల‌ర్ సంగీత అజ‌య్ సింగ్ ఠాకూర్ కోరారు. శ‌నివారం తాండూరు కొత్త మున్సిప‌ల్ భ‌వ‌నంలో అధికారులకు ఫిర్యాదును అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిప‌ల్ ప‌రిధిలోని త‌మ వార్డు 20లో జియో సంస్థ‌కు చెందిన ట‌వ‌ర్ నిర్మాణం ప‌నులు చేప‌డుతున్నార‌ని ఆరోపించారు. ట‌వ‌ర్ నిర్మాణంపై వార్డు ప్ర‌జ‌ల నుంచి అభ్యంత‌రాలు వ‌స్తున్నాయ‌న్నారు. కావున వార్డులో నిర్మాణం చేప‌డుతున్న ట‌వ‌ర్ ప‌నుల‌ను వెంట‌నే నిలిపివేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో కౌన్సిల‌ర్ వెంట‌ వార్డు మ‌హిళ‌లు త‌దిత‌రులు ఉన్నారు.