తాండూరు కాలేజీకి బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు
– సీఎం చేతుల మీదుగా అందుకున్న శంకర్ నాయక్
– ప్రత్యేకంగా అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీకి బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు దక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా ఇంచార్జ్ నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ అవార్డును అందుకున్నారు.

శుక్రవారం హైదరాబాద్ మాదాపూర్ లోని శిల్పకలా వేధికలో గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పలువురుకి ఉత్తమ అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ తరుపున రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకర్ నాయక్ అందుకున్నారు.

ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా నుంచి ప్రభుత్వ కాలేజీకి బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు రావడం పట్ల శంకర్ నాయక్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఈయేడాది ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం సాధించడంతో పాటు రాష్ట్రంలోని సుమారు 400ల కాలేజీలలో కంటే తాండూరు కాలేజీలో జనరల్, ఒకేషనల్ విభాగంగా సుమారు 900లకు పైగా అడ్మిషన్లు నమోదు చేసి.. ఉన్నత స్థాయిలో నిలిచింది.

ఇందుకుగాను తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీకి బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు దక్కింది. తాండూరు కాలేజీకి బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు రావడం పట్ల ఇంచార్జ్ ప్రిన్సిపల్ మల్లినాథప్ప, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

