రామ మందిరంకు ఉపాధ్యాయుడికి చేయూత
– ఆలయ పునర్ నిర్మాణం కోసం రూ.50వేల విరాళం
– మరో రూ. 30వేలు జమ చేసి ఇచ్చిన యువకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్ లోని రామ మందిర పునర్ నిర్మాణానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన వంతు చేయూతను అందించారు.

అదేవిధంగా స్థానికంగా ఉండే యువకులు రూ.30వేలు జమ చేసి ఆలయ కమిటి సభ్యులకు అందజేశారు. గత కొన్ని రోజులుగా ఇందిరానగర్ లోని రామ మందిర పునర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పునర్ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు రావద్దని భక్తులు, వ్యాపారులు, ఉద్యోగులు చేయూతను అందిస్తున్నారు. ఇందులో భాగంగా కాలనీకీ చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు మురళీ కుమార్ తన వంతుగా రూ.50వేలను ఆలయ కమిటి సభ్యులకు విరాళంగా అందజేశారు.

అదేవిధంగా అదే కాలనీకి చెందిన యువకులు ఇంటింటికి తిరిగి రూ.30వేలను జమ చేశారు. అట్టి డబ్బులను కూడా ఆలయ కమిటికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటి సభ్యులు మాట్లాడుతూ రామ మందిర పునర్ నిర్మాణానికి ప్రతి ఒక్కరు విరాళాల రూపంలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షులు శ్రీనివసా, గౌరవాధ్యక్షులు శేఖర్, బోయరాజు, యాదదిరిచారి, ఉపాధ్యక్షులు దోమ శ్రీనివాస్, కె. వెంకటేష్, కోశాధికారి అంజిల్ రెడ్డి, ఆనంద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు మొగులప్ప, రాము చారి, ప్రవీణ్ కుమార్, సభ్యులు హన్మయ్య, భద్రప్ప, కృష్ణ, గోపాల్, చందు, శ్రావణ్, అనిల్ కుమార్, తిరుపతి, యాదవ చారి, రమేష్, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

