తాండూరు బహుజన నాయకుడు మాణిక్ రావు
– ఆయన ఆశయాలను కొనసాగించాలి
– విద్యా వికాస్ ట్రస్ట్ భూమిని కాపాడుకోవాలి
– బీసీ కమిషన్ సభ్యులు మాజీ శుభ ప్రద్ పటేల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ బహుజన నాయకుడు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు మాణిక్ రావు అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మాజీ మెంబర్ నూలి శుభప్రద్ పటేల్ అన్నారు.

సోమవారం మాణిక్ రావు 9వ వర్ధంతి సందర్భంగా ఆయ సతీమణి శశి ప్రభా, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్న రెడ్డి గారితో కలసి తాండూరులోని మాణిక్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు 1969 లో తెలంగాణ ఉద్యమo లో క్రియాశీలా పాత్ర వహించి తాండూర్ పాంత్రంలో బహుజన నాయకుడిగా రాష్ట్ర మంత్రి గా చాల సేవలు అందించారు,

తాండూర్ ప్రజలకోసం పీపుల్స్ కాలేజీ ని స్థాపించారు అని, అయన ఆశయ సాధనకు తాండూర్ ప్రజలు కంకణబద్దులు కావాలని అయన పిలుపునిచ్చారు , ట్రస్ట్ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడలిసిన భాద్యత తాండూర్ ప్రజలపైన ఉన్నది అయన తెలిపారు ఈ కార్యక్రమనికి నాయకులు మాజీ మునిసిపల్ ఛైర్పర్సన్ స్వప్న పరిమళ డీసీసీబీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి , రాంరెడ్డి , సుభాన్ రెడ్డి , రఘు , రామకృష్ణ శుభ ప్రద్ పటేల్ ట్రస్ట్ సభ్యులు భాను , సాయి , మనోహర్ నరేష్ గౌడ్ , మొయిజ్ , మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

