బిర్యానీ అర్డర్‌కు బొద్దింక ప్రీ..!
– దుర్గా గ్రాండూర్యూ హోటల్‌లో నిర్వాకం
– కస్టమర్ ఫిర్యాదుతో షాక్ ఇచ్చిన అధికారులు
– రూ. వేల జరిమాన విధించిన మున్సిపల్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు బిర్యానితో పాటు బొద్దింకను కూడా ఫ్రీగా వడ్డించారు. ఖంగుతిన్న కస్టమర్ హోటల్ నిర్వాకంపై అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

దీంతో అధికారులు హోటల్ యజమాన్యంకు భారీ జరిమానతో షాక్ ఇచ్చారు. ఈ సంఘటన తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని శ్రీ దుర్గా గ్రాండ్యూర్‌లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఓ ఇద్దరు హోటల్‌కు వెళ్లారు. బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. కాసేపటికి ఆర్డర్ చేసిన బిర్యాని వచ్చింది. తిందామనే సరికి అందులో బొద్దింక కనిపించింది. హోటల్ యజమాన్యంను ప్రశ్నించారు.

అనంతరం తాండూరు మున్సిపల్ కార్యాలయంకు వెళ్లి హోటల్ యజమాన్యంపై ఫిర్యాదు చేశారు. బిర్యానిలో బొద్దింకలు వచ్చాయని, హోటల్‌పై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం మున్సిపల్ అధికారులు హోటల్‌ను తనిఖీ చేశారు. ఇంచార్జ్ శానిటరీ ఇనుస్పెక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో జవాన్లు, సిబ్బంది హోటల్‌లో వంటగది, తినుబండారాల పాత్రలు, తదితర విభాగాలను పరిశీలించారు. అయితే బిర్యానిలో బొద్దింక వచ్చిందని కస్టమర్లు చేసిన ఫిర్యాదు మేరకు హోటల్ యజమాన్యంకు రూ. 25వేల జరిమాన విధించారు. మరోసారి ఇలాంటి ఫిర్యాదులు వస్తే హోటల్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మరోవైపు బిర్యానీ అర్డర్ చేసిన కస్టమర్లు కక్ష్య పూరితంగా ఇలా చేశారని యజమాన్యం ప్రతినిధులు కొట్టిపారేశారు.

ఇదికూడా చదవండి…

