అధికార పార్టీకి ఓటేస్తే అభివృద్ధి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అధికార పార్టీకి ఓటేస్తే అభివృద్ధి..!
– మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– 33వ వార్డులో పార్టీ కార్యాలయం ప్రారంభం
– 2వ వార్డులో అభ్యర్థి గెలుపుకు ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అధికార పార్టీకి ఓటు వేసి అందరు తాండూరు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. బుధవారం తాండూరు పట్టణంలోని 35వ వార్డులో పార్టీ అభ్యర్థి అష్టామానియా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యాలయం ప్రారంభించారు.

అదేవిధంగా పట్టణంలోని 2వ వార్డు అభ్యర్థి ప్రత్యూష మోహన్ తరుపున ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండేళ్లలో రూ. 100ల కోట్లతో తాండూరును అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుర్చీలాటతో అభివృద్ధి కుంటుపడిందని విమరి ్శంచారు. తాండూరు ప్రజలందరు అధికార పార్టీకి ఓటు వేసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో తాండూరును మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు సర్దార్ ఖాన్, ఇక్బాల్, ప్రభాకర్ గౌడ్, భీం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి