బైపాస్ రోడ్డుకు మహర్ధశ..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

బైపాస్ రోడ్డుకు మహర్ధశ..!
– రోడ్డు పనులకు నిధుల మంజూరు
– వ్యవసాయేతర భూములకు కూడా పరిహారం
– ఫలించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డుకు మళ్లీ మహర్ధశ పట్టింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం నిధుల విడుదలకు సంబంధించి జీఓ 130ను జారీ చేసింది.

గత ప్రభుత్వ హాయాంలో నిర్మాణ పనులు ప్రారంభమై.. మద్యలో కొన్ని ఆటంకాలతో పనులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోడ్డు పనులు పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆర్అండ్‌బీ శాఖ చీఫ్ సెక్రటరిలను కలిసి వినతిపత్రాలను అందజేశారు. తాజాగా సోమవారం ప్రభుత్వం తాండూరు బైపాస్ రోడ్డుకు సంబంధించి జీఓను జారీ చేసింది. రోడ్డు పనుల కోసం రూ.108 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్లు జీవో 130ను తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ద్వారా జారీ చేశారు.
kvcs
గతంలో ఉన్న రూ. 78 కోట్ల నుండి రూ.108 కోట్ల రూపాయలు పెంచినట్లు స్పష్టం చేసింది. అదేవిధంగా అసంపూర్తి పనులతో పాటు భూనిర్వసితులకు నష్టపరిహారం చెల్లించనున్నట్లు వెల్లడించింది. భూ నిర్వాసితులకు నష్టపరిహారం గతంలో రూ.17.40 కోట్లతో పాటు అధనంగా రూ.25.13 కోట్లు పెంచడం జరిగిందని పేర్కొంది. భూ నిర్వాసితులకు మొత్తం రూ. 42.53 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపింది. వ్యవసాయేతర భూమికి గజానికి రూ.6000, వ్యవసాయ భూమికి ఎకరానికి రూ. 21 లక్షలు చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చూపిన చొరవకు అభినందనలు తెలుపుతున్నారు.

ఇదికూడా చదవండి…

ఏం.. తాగి.. నడిపావ్‌.. రా..!