మార్కెట్ కమిటీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి

తాండూరు రాజకీయం వికారాబాద్

మార్కెట్ కమిటీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి
– మంత్రి తుమ్మలతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు.

బుధవారం హైదరాబాద్ లో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్, కోట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీల అభివృద్ధి పనులకు సంబంధించి చర్చించారు. యార్డులలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
kvcs
ఇందుకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సానుకూలంగా స్పందించి సంబంధిత శాఖ అధికారుల ద్వారా ప్రతిపాధనలు చేస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోట్ పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ అంజయ్య తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

బీసీ రిజర్వేషన్లు తేల్చాకే.. ఎన్నికలకు వెళ్లాలి