రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
– సమయ పాలనలో నిర్లక్ష్యం వహించరాదు
– సమస్యలు, ఇబ్బందుల పరిష్కారానికి కృషి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోగులకు మెరుగైన వైద్యం అందించేలా దృష్టిసారించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు.

ఆసుపత్రి సూపరిండెంట్ డా. వినయ్ కుమార్ తో కలిసి ఆసుపత్రిలోని పలు వార్డులను సందర్శించారు. క్యాసువాలిటి, మెడికల్ వార్డులు, పలు విభాగాలకు చెందిన వార్డులను పరిశీలించారు. మెడికల్ వార్డులలో చికిత్స పొందుతున్న అనారోగ్య బాధితులను పలకరించారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్సలు, వైద్య సేవలు ఎలా అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రికి సంబంధించిన పలు రికార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు.
kvcs
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే పేదలను దృష్టిలో ఉంచుకుని వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సమయ పాలనలో, వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఆసుపత్రిలో ఉన్న ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, హబీబ్ లాల, ఆసుపత్రి ఆర్ఎంఓ డా. ఆనంద్ గోపాల్ రెడ్డి, డా. మూర్తి, ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

అందరి సహకారంతో భద్రేశ్వర దేవాలయ అభివృద్ధి