కుక్కల దాడిలో మేకలు బలి
– ఒకేసారి 55 మేకల మృత్యువాత
– కందనెల్లి గ్రామంలో దారుణం
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : దొడ్డిలో కట్టేసి ఉంచిన మేకల మందపై కుక్కలు విరుచుకుపడి.. విచక్షణంగా దాడి చేశాయి. దీంతో ఒకేసారి 55 మేకలు మృత్యువాత పడ్డాయి.

ఈ దారుణ సంఘటన పెద్దేముల్ మండలంలో చోటు చేసుకుంది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కందనెల్లి గ్రామానికి చెందిన ఒగ్గు సత్తయ్య మేకలను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజూ మేకలను కాసేందుకు తీసుకవెళ్లగా కొన్ని మేక పిల్లలను ఇంటివద్ద దొడ్డిలో కట్టేసి ఉంచుతాడు.

సోమవారం కొన్ని మేకలను మేపేందుకు తీసుకెళ్లగా.. కొన్నింటిని ఇంటి వద్ద దొడ్డిలో కట్టేసి వేళ్లాడు. సాయంత్రం వేళ ఊళ్లో తిరిగే కుక్కలు దొడ్డిలోకి ప్రవేశించాయి. దొడ్డిలో ఉన్న మేకలపై దాడి చేసి గాయపరిచాయి. కుక్కల దాడిలో సుమారు 55 మేకలు మత్యువాత పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు విచారం వ్యక్తం చేశారు. యజమానికి తీరనినష్టం వాటిళ్లిందని వాపోయాడు.

ఇదికూడా చదవండి…

