తాండూరు దర్నాపై సీరియస్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు దర్నాపై సీరియస్..!
– పాల్గొన్న పలువురుపై కేసులు..?
– నమోదుకు సిద్దమైన పోలీసు శాఖ..?
– ఈ నిర్ణంయ ఎందుకు తీసుకున్నారంటే.?
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల రోడ్డు ప్రమాదంను నిరసిస్తూ తాండూరు డెవలప్‌ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన తాండూరు దర్నాపై స్థానిక పోలీసు శాఖ సీరీయస్‌ అయ్యినట్లు తెలుస్తోంది. దర్నాలో పాల్గొన్న పలువురిపై కేసులు నమోదు చేసేందుకు సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం.

చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తాండూరుకు చెందిన సుమారు 14 మంది మృతి చెందడంతో తాండూరు డెవలప్‌ మెంట్ ఫోరం ఆందోళనకు పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వద్ద భారీ దర్నా చేపట్టారు. ఈ దర్నాలో రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు, వ్యాపారులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు.
kvcs
మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండు చేస్తూనే ప్రభుత్వాలకు, పాలకుల వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు 3 గంటల పాటు దర్నా కొనసాగింది. దర్నాలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అయితే ఈ దర్నాపై స్థానిక పోలీసులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో చేపట్టిన దర్నాకు ఎలాంటి అనుమతులు లేవని, పైగా దర్నాలో ఆందోళన వాతావరణం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిందని భావిస్తున్నారు. ఈ మేరకు దర్నాలో పాల్గొన్న పలువురు అంటే సుమారు 30 మంది వరకు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన తాండూరులో చర్చనీయాంశంగా మారింది.

ఇదికూడా చదవండి…

తాండూరు బంద్ అయోమయం..!