మృతుల కుటుంబాలకు మనోహరన్న అండ అభినందనీయం

తాండూరు రాజకీయం వికారాబాద్

మృతుల కుటుంబాలకు మనోహరన్న అండ అభినందనీయం
– రెండు రోజుల్లోనే పరిహారం అందించడంలో పత్యేక చొరవ
– హాజీపూర్ అక్కాచెల్లెళ్ల బాధ్యతను తీసుకోవడం హర్షణీయం
– తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అందించిన అండ అభినందనీయమని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు రెండు రోజుల్లోనే ప్రభుత్వం నుంచి పరి హారం అందించడంలో శ్రద్ద చూపించారని అన్నారు.

బుధవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలలో ఒక్కొక్కరికి రూ.7లక్షల చొప్పున పరిహారం అందించడంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారని తెలిపారు. రెండు రోజుల్లో పరిహారం అందించే విధంగా శ్రద్ధ తీసుకున్నారని అన్నారు. అంతేకాకుండా బాధితుల ఇంటింటికి వెళ్లి పలకరించి.. మనోధైర్యం చెప్పారని అన్నారు. హాజీపూర్ గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్ల బాధ్యతను తీసుకోవడం అభినందనీయమన్నారు.
kvcs
వారి చదువులకు సాయం అందిస్తామని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని చెప్పడం గొప్ప విషయమన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలకు అండగా నిలవడం హర్షణీయమన్నారు. కుటుంబాలకు అండగా నిలవడం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొండగట్టు వద్ద జరిగిన ప్రమాదంలో బాధిత కుటుంబాలకు న్యాయం చేయలేక పోవడం… ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

ఇదికూడా చదవండి…

బైకును తప్పించబోయి ఆటో బోల్తా