బీసీలారా… కదలండి!
– న్యాయ సాధన దీక్షలో పాల్గొందాం
– రేపు ఇందిరా పార్క్ వద్ద బీసీల న్యాయ సాధన దీక్ష
– పాల్గొనున్న బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య,అఖిలపక్ష నాయకులు
– జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ సమాజానికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ, రేపు ఉదయం 10:30 గంటల నుండి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీల న్యాయ సాధన దీక్ష నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ న్యాయ సాధన దీక్షకు జాతీయ బీసీ అధ్యక్షులు, బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్యతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రధాన నాయకులు, బీసీ కుల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొననున్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున బీసీలు ఈ దీక్షలో పాల్గొని ఐక్యత శక్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లపై కోర్టుల తీర్పులు ప్రతి సారి ప్రతికూలంగా రావడం వల్ల, రాజ్యాంగ భద్రత కల్పించడమే శాశ్వత పరిష్కారం అని స్పష్టం చేశారు.

బీసీలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వెనుకబడిన పరిస్థితులను మార్చేది ఐక్యత, చైతన్యం, నిరంతర పోరాటం మాత్రమే,ఈ న్యాయ సాధన దీక్షను విజయవంతం చేసి, బీసీల శక్తి, సంకల్పం, ఐక్యతను ప్రపంచానికి చాటాలని రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు.

ఇదికూడా చదవండి…

