మెజార్టీ స్థానాలు హస్తగతం..!
– సర్పంచు అభ్యర్థుల గెలుపు ఖాయం
– ఏకగ్రీవం అయితే రూ. 10 నుంచి 20లక్షలు
– నామినేషన్ల దాఖలలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను హస్తగతం చేసుకుంటామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.

శనివారం తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జనార్దన్ రెడ్డి, సంగెంకలాన్ అభ్యర్థిగా భాగ్యలక్ష్మీ, కొత్లాపూర్ అభ్యర్థిగా పట్లోళ్ల లతలు ఎన్నికల్లో వేసిన నామినేషన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీ మద్దతు అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. వాటినే ఎన్నికల్లో అస్త్రాలుగా మారుతాయన్నారు. సర్పంచు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులు గెలుపొందడి ఖాయమన్నారు. ఏకగ్రీవ పంచాయతీలు అయితే రూ.10లక్షల నుంచి 20లక్షలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, డా. సంపత్ కుమార్, మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు రవి శిందే, రఘునాథ్ రెడ్డి, నాయకులు మద్దతుదారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

