ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు
– తాండూరులో ఎయిడ్స్ దినోత్సవం
– ర్యాలీని ప్రారంభించిన సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎయిడ్స్ మహామ్మారిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్నారు. సోమవాం తాండూరులో వైద్య ఆరోగ్య శాఖ, దిశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 1 ఎయిడ్స్ దినత్సవాన్ని నిర్వహించారు.

తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రి వద్ద తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో వైద్యాధికారులు, నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, దిశ సంస్థ వాలంటీర్లు పాల్గొని ఎయిడ్స్ నియంత్రణపై నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. స్వచ్చన కుమారి మాట్లాడుతూ జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు కృషి చేస్తున్నామని అన్నారు.

జిల్లాలో 3800 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. గత యేడాదితో పోలిస్తే హెచ్ఐవి కేసుల సంఖ్య తగ్గుతోందని తెలిపారు. తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో పాజిటివ్ తో ఉన్న ఇద్దరు గర్భిణీలకు ప్రసవం చేసినట్లు తెలిపారు. ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. రవీంద్ర యాదవ్, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. వినయ్ కుమార్, తాండూరు ఐఎంఏ అధ్యక్షులు డా. జయప్రసాద్ లు మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించారు. నివారణ కంటే నిరోధన చాలా ఉత్తమైనదని అన్నారు. ఎయిడ్స్ మహమ్మారిని ప్రారద్రోలేందుకు అందరు తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి, వ్యాసరచన పోటీలో గెలిచిన విద్యార్థులకు, వాలంటీర్లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీటీసీ, ఏఆర్టీ, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

వార్డు సభ్యుల అభ్యర్థులకు షాక్…!