రెండు సెల్ ఫోన్ల రికవరీ..!
– సీఈఐఆర్ తో ట్రేస్ చేసిన పోలీసులు
– వినియోగదారులకు అందించిన సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇద్దరు వినియోగదారులు పోగొట్టుకున్న రెండు సెల్ ఫోన్లను తాండూరు పట్టణ పోలీసులు ట్రేస్ చేసి రికవరీ చేశారు. శుక్రవారం పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా వినియోగదారులకు తిరిగి అప్పగించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. గత యేడాది జులై 7వ తేదిన పట్టణంలోని సాయిపూర్ లో పట్లోళ్ల నరేష్ రెడ్డి అనే వ్యక్తి తన సెల్ ఫోన్‌ను పోగొట్టుకున్నారు. అదే యేడాది డిసింబర్ 28న బషీరాబాద్ మండలంకు చెందిన అజ్మతుల్లా తాండూరు ఆర్టీసీ బస్టాండ్లో తన ఫోన్ పోగొట్టుకున్నారు. ఇద్దరు తాండూరు పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కొత్తగా ప్రవేశ పెట్టిన సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోలీసులు పోయిన ఫోన్లను ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఈ రెండు ఫోన్లను శుక్రవారం తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా వినియోదారులకు అందజేశారు. అనంతరం సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులు తమ ఫోన్ పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలిస్తే సీఈఐఆర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. పోగొట్టుకున్న ఫోన్ ను రికవరీ చేయిస్తామన్నారు.
ఇదికూడా చదవండి…

