పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
– తాండూరు నియోజకవర్గంలో 500మందితో బందోబస్తు
– పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు చర్యలు
– వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగిందని వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ తెలిపారు. బుధవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎన్నికల ఏర్పాట్లను తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోని తాండూరు, కోడంగల్ నియోజకవర్గంలోని మండలాల్లో మొదటి విడతలో భాగంగా జరుగున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కోడంగల్ నియోజకవర్గాన్ని జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో తన ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు.

నియోజకవర్గంలో పంచాయతి ఎన్నికల సందర్భంగా ఇద్దరు డీఎస్పీలు, 14 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలతో పాటు మరికొంత పోలీసు బలగాలు సుమారు 500ల మందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా సున్నితం, సమస్యాత్మక పొలింగ్ కేంద్రాలపై దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని 30 సమస్యాత్మక కేంద్రాల వద్ద పికెటింగ్, 1ప్లస్ పోలీస్ భద్రత ఏర్పాట్లను ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. పంచాయతి ఎన్నికల్లో ప్రజలు, ఓటర్లు భయాందోళనకు గురికాకుండా స్వేచ్చగా.. ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

