‘నమస్తే’కు పీవీఆర్ గుడ్ బై..!

తాండూరు రాజకీయం వికారాబాద్

‘నమస్తే’కు పీవీఆర్ గుడ్ బై..!
– దినపత్రికకు రాజీనామ పత్రం అందజేత
– తదుపరి అడుగులపై పెరుగుతున్న అసక్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : నమస్తే తెలంగాణ తాండూరు నియోజకవర్గం రిపోర్టర్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి శనివారం నమస్తే తెలంగాణ దినపత్రికకు రాజీనామా చేశారు.

గత 13 సంవత్సరాలుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో ఎన్నో అద్భుతమైన కథనాలను రాశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఎన్నో సేవలు అందించారు. తెలంగాణ ఉద్యమంలో పురుడు పోసుకున్న నమస్తే తెలంగాణ దినపత్రికకు సైనికుడిగా సేవలందించిన పెరుమాళ్ల వెంకట్ రెడ్డి నేడు రాజీనామా చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా..? వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళనున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రైతు కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి, తాండూరులో విద్యాసంస్థలను నిర్వహిస్తూ… పాత్రికేయునిగా సేవలందించిన ‘పివిఆర్’ ప్రయాణం ఎటువైపు అనేది తాండూర్ రాజకీయ వేత్తల్లో చర్చనీయంగా మారింది.

ఇదికూడా చదవండి…

కోట్ పల్లి సర్పంచ్ భర్త కుటుంభానికి భరోసా..!