మంత్రి కేటీఆర్‌తో తాండూరు నేతల భేటి

తాండూరు రాజకీయం వికారాబాద్

మంత్రి కేటీఆర్‌తో తాండూరు నేతల భేటి
– అభివృద్ధి, పార్టీ వ్యవహారాలపై చర్చ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో తాండూరు టీఆర్ఎస్ నేతలు భేటి అయ్యారు.
శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే ఎం.నారాయణరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీశైల్రెడ్డి,
రాజుగౌడ్, డాక్టర్ సంపత్ కుమార్, హరిహరగౌడ్ తదితరులు మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ను కలిసిన నాయకులు పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ తాండూరు అభివృద్ధి, పార్టీ వ్యవహారాలపై చర్చించారు.