ఉన్మాదిలా మారిన యువకుడు..!
– స్నేహితునిపై కత్తితో హత్యాయత్నం
– అడ్డువచ్చారని.. తండ్రి కొడుకులపై దాడి
– తండ్రిని హైదరాబాద్‌కు తరలింపు
– తాండూరు రాజీవ్ కాలనీ వద్ద ఘటన
– విచారణ ముమ్మరం చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కత్తితో స్నేహితున్ని చంపేందుకు యత్నించిన ఓ యువకుడు ఉన్మాదిలా మారి.. అడ్డుగా వచ్చిన ఓ తండ్రి కొడుకులపై అదే కత్తితో దాడి చేశాడు. తండ్రి కడుపులో నుంచి పేగులు బయటకు రాగా.. కుమారుడి చాతిపై రక్తగాయాలయ్యాయి.

ఈ సంఘటన తాండూరు పట్టణం రాజీవ్ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంభీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం ఖాంజాపూర్ గ్రామానికి చెందిన గోపాల్, తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన కిట్టుల మద్య గొడవలు జరుగుతున్నాయి. గోపాల్ కిట్టును చంపాలని పథకం వేసుకున్నాడు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం వేళ గోపాల్ తన వెంట కత్తి తెచ్చుకున్నాడు. రాజీవ్ కాలనీ సమీపంలో ఉన్న కిట్టుపై గోపాల్ అదర్శ్, అనిల్, ప్రవీణ్ కుమార్‌లతో పాటు ఇందిరమ్మ కాలనీకి చెందిన క్రిష్ణ, ప్ఱవాంత్, చింటులతో కలసి దాడి చేసేందుకు యత్నించాడు. అంతలోనే అక్కడే ఉన్న నూర్ హైమద్ కు చెందిన చికెన్ షాపులో దూరి షెటర్ వేసుకున్నాడు.

లోపలికి వెళ్లేందుకు యత్నించిన గోపాల్ ను నూర్ హైమద్ అడ్డుకోవడంతో అదే కోపంలో కత్తితో నూర్ హైమద్ పై దాడికి పాల్పడ్డాడు. కత్తి పోట్లకు గురైన నూర్ హైమద్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న కుమారుడు అబ్దుల్ గోపాల్ ను నిలదీయడంతో అతనిపై కూడా దాడికి యత్నించాడు. స్థానికుల రాకతో గోపాల్ అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు తండ్రి, కుమారులను తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నూర్ హైమద్ ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. కుమారుడు అబ్దుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితున్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. తాండూరు పట్టణంలో కలకలం రేపిన ఘటనపై డీఎస్పీ నర్సింగ్ యాదయ్య వివరాలను ఆరా తీస్తున్నారు.

ఇదికూడా చదవండి…

