వ‌చ్చే నెల‌లో ఇంట‌ర్ ఫ‌లితాలు

కెరీర్ తెలంగాణ హైదరాబాద్

వ‌చ్చే నెల‌లో ఇంట‌ర్ ఫ‌లితాలు
– మొద‌టి వారంలో ప్ర‌కటించే అవ‌కాశం
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: క‌రోనా సెకండ్ త‌గ్గుముఖం త‌రుణంలో నిర్వ‌హించిన ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌కు సంబంధించి బోర్డు అధికారులు కీల‌క విష‌యాన్ని వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాలను వ‌చ్చే నెల‌లో వెల్ల‌డించ‌నున్న‌ట్లు సంకేతాల‌ను ఇచ్చారు. గత నెల 25 నుండి ఈ నెల మూడో తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీతో స్పాట్ వాల్యుయేషన్‌ను కూడా ముగించారు. ప్రస్తుతం మార్క్స్ డేటా క్రోడీకరణ పని జరుగుతుందని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే.. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాలను వెల్లడించవచ్చునని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 4 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ప‌రీక్ష ఫ‌లితాల కోసం విద్యార్థులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.