పేదల ఆరోగ్యానికి భరోసా
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– 88 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల ఆరోగ్యానికి తెలంగాణ సర్కారు భరోసా అందిస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరు అయిన చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన చేతుల మీదుగా నియోజకవర్గంలోని 88 మంది లబ్దిదారులకు మంజూరైన రూ. 39లక్షల 56వేల విలువైన ఎల్దసీలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం అండగా నిలుస్తోందని అన్నారు. కార్పోరేట్ స్థాయి వైద్యం పొంది ఆరోగ్యాలకు భరోసా అందిస్తుందని అన్నారు. అర్హులైన పేదలు సీఎంఆర్ఎఫ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, నాయకులు బంటు మల్లప్ప, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, గాజుల మాధవి, మహిపాల్ రెడ్డి, సర్పంచులు, మార్కెట్ కమిటి డైరెక్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

