భద్రేశ్వర దేవాలయ కమిటి చేయూత..!
– ఎస్టీఓ ఆఫీసుకు ఇన్వేటర్కు సాయం
– అభినందించిన ఆర్బీఓఎల్ సీఈఓ బీఎస్ఆర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రసిద్ద భద్రేశ్వర దేవాలయ కమిటి చేయాతను అందించింది. తాండూరులోని ఎస్టీఓ కార్యాలయంలో ఇన్వెటర్ లేక కార్యకలాపాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

ఈ విషయం భద్రేశ్వర దేవాలయ కమిటి దృష్టికి వచ్చింది. దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సమస్యకు పరిష్కారం అందించేందుకు తోడ్పాటు అందించారు. ఎస్టీఓ కార్యాలయానికి ఇన్వేటర్ ఇప్పించేందుకు ముందుకు వచ్చారు. బుధవారం తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) చేతుల మీదుగా భద్రేశ్వేర దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, సభ్యుల సమక్షంలో ఆర్ధిక సాయం అందజేశారు.

ఈ సందర్బంగా దేవాలయ కమిటి అందించిన చేయూతను బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు కోటం సిద్ధలింగం, జొల్లు రోహిణి, శెట్టి సురేష్, కిరణ్ కుమార్, ప్రశాంత్, సమాజం పెద్దలు జొన్నల బస్వరాజ్, బీదర్ రాజశేఖర్, సభ్యులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

