కాంగి’రేసుకు’ రెడీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగి’రేసుకు’ రెడీ..!
– కేఎల్‌ఆర్‌కు తాండూరు టిక్కెట్‌..?
– ఆయన పోటీ కన్ఫామ్‌పై జోరుగా చర్చ
– ఇంకా కష్టపడుతున్న ఎం.రమేష్‌ మహరాజ్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే తాండూరు నియోజకవర్గంలో రేసులోని అభ్యర్థులను ఖరారు చేసే సమయం రానే వచ్చింది. తాండూరు అభ్యర్థిగా కేఎల్‌ఆర్‌ను కన్ఫాఫ్ చేసినట్లు తాండూరులో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో అసెంబ్లీ పోరులో కాంగ్రెస్ రేసుకు సిద్దమైనట్లుగా కనిపిస్తోంది. ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు స్థానం నుంచి దాదాపు 10 మందికి పైగా దరఖాస్తులు సమర్పించుకున్నారు. మేడ్చేల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్‌), టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్‌ మహరాజ్, ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మరో ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి, వికారాబాద్‌కు చెందిన సుధాకర్ రెడ్డి, స్పోక్ పర్సన్ కల్వ సుజాత, మాజీ సర్పంచ్ ఉత్తమ్ చంద్, జనార్దన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉమేర్ అబ్దుల్లా, ప్రముఖ వ్యాపారి శ్రీరాంరెడ్డిలు దరఖాస్తులు సమర్పించారు. ఇందులో అధిష్టానం కేఎల్‌ఆర్‌ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయనకే ఈ సారి టిక్కెట్‌ కన్ఫామ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే తాండూరు ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఎం. రమేష్‌ మహరాజ్ ఇంకా కష్టపడుతున్నారు. ఈ సారి టిక్కెట్‌ తనకే వస్తుందని, బీసీ నినాదంతో ఎమ్మెల్యేగా పోటీ చేసే చాన్స్‌ దక్కుతుందని ఇంకా భావిస్తున్నారు. అయితే గతంలో మూడు సార్లు ఎం.రమేష్‌ మహారాజ్‌కు అవకాశం దక్కినా పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ సారి టిక్కెట్టు సాధించుకునే చెమటోడుస్తున్నారు. మరోవైపు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి సైతం తనకే టిక్కెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు.

కేఎల్‌ఆర్‌తో టచ్‌లో ఉన్న నేతలు
కాంగ్రెస్ అధిష్టానం తాండూరు టిక్కెట్‌ను కేఎల్‌ఆర్‌కు అందించడంలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయని తాండూరు నేతలు గుసగుసలాడుతున్నారు. కాని కేఎల్‌ఆర్‌కు టిక్కెట్‌ కన్ఫామ్ అవుతుందనే ప్రచారం జరగడంతో స్థానిక నేతలు ఆయనకు టచ్‌లో ఉంటున్నట్లు టాక్. దీంతో కేఎల్ఆర్ సైతం నేతల ద్వారా తాండూరు పరిస్థితిపై ఆరా తీయడంతో పాటు తనదైన శైలిలో సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన తాండూరుకు వస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!