అభివృద్ధి చేశాం.. ఓటు అడుగుతున్నాం..!
– మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– 1వ వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే తాండూరు పట్టణ అభివృద్ధి జరిగిందని.. అందుకే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నామని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తాండూరు పట్టణం 1వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నాగలక్ష్మి తరపున ప్రచారం చేశారు.

సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో తాండూరు పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ ప్రచారం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకొని ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో గెలిస్తే అన్ని వార్డులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. రెండేళ్ల కాలంలో పట్టణాభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని సూచించారు. 1వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాగలక్ష్మి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

వార్డులో ప్రజాపాలన, అధికారుల పాలన ఇంటి వద్దకే తీసుకువచ్చి సమస్యలతో పాటు అభివృద్ధిని చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు 1వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టి శాంతు, అశోక్ పలువురు మైనార్టీ మహిళలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి రోహిత్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఆల్ ఇండియా బంజారా సంఘం నాయకులు వాసు పవార్ నాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

