ఎమ్మెల్యే, సోదరునిపై కేసులు నమోదు చేయండి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యే, సోదరునిపై కేసులు నమోదు చేయండి
– ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేతలపై చర్యలు తీసుకోండి
– తాండూరు పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అతని సోదరుడు శ్రీనివాస్ రెడ్డిపై కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, తాండూరు మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి అన్నారు.

ఆదివారం తాండూరు పట్టణ పోలీస్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాండూరు ఎమ్మెల్యే, అతని సోదరుడుతో పాటు మున్సిపల్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో వార్డు నెంబర్ 23వ వార్డు పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి వందల మంది అనుచరులతో చొచ్చుకువెళ్లే ప్రయత్నించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి దొంగ ఓట్లు పడుతున్నాయని శ్రీనివాస్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడమే కాకుండా అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని అడ్డుకున్నారని తెలిపారు. అదేవిధంగా ఈనెల 13న జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి ఇంకా 5వ వార్డుల లెక్కింపు ఉండగానే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొచ్చుకుపోయారని తెలిపారు.

పోలీసులు మౌనంగా ఉండిపోయారని అన్నారు. ||ఎమ్మెల్యేతో పాటు డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, ప్రచార సమన్వకర్త కరణం పురుషోత్తంరావు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, తదితరులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కేంద్రంలోకి వచ్చారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేంద్రానికి వచ్చి ఎమ్మెల్యేను. నేతలు, అనుచరులను ఎలా అనుమతించారని ప్రశ్నించారని తెలిపారు. ఈ విషయంపై దుర్మార్గంగా రోహిత్ రెడ్డిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే. నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి 48 గంటలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, అతని సోదరుడు, కోడ్ ఉల్లంఘించిన నేతలపై బీఎన్ఎస్ఎస్ చట్టం కింద, ఆర్పి చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్, బీఆర్ఎస్ తాండూరు మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

వైభవంగా మహా శివరాత్రి..!