ధాన్యం రైతులకు సర్కారు అండ

తాండూరు వికారాబాద్

ధాన్యం రైతులకు సర్కారు అండ
– కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ధాన్యం రైతులకు తెలంగాణ సర్కారు అండగా ఉంటుందని, ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చె స్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం పండించిన రైతులు ఆధైర్య పడాల్సిన అవసరం లేదని, యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం మార్కెట్ కమిటీ, డీసీఎంఎస్, సహాకార సంఘాలు, ఐకేపీల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కా నుగోలు చేస్తుందన్నారు. రైతులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల నుంచి వానాకాలం పంటలో ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. దీంతోపాటు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు గొనే పంచులు సమస్యలు రాకుండా, ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టేందుకు అధికారులను ఆదేశించడం జరుగుతుందన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పల్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్కుమార్ రాజుగౌడ్, పదోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి. వివిధ మండలాల అధ్యక్షులు రాందాస్, కోహిర్ శ్రీనివాస్. రాములు నాయక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆశన్న, సప్తగిరి, మల్లప్ప, భీంరెడ్డి, ఇర్ఫాన్, మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేశ్వరి, అధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.