అదనపు బస్సులను కేటాయించండి
-ఆర్టీసీ చైర్మన్‌ను కలిసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్టీసీ డిపోకు అదనంగా బస్సులను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి కలిశారు.
ఈ సందర్భంగా తాండూరు ఆర్టీసీ డిపో సమస్యలపై చర్చించారు. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అదనపు బస్సులు కేటాయిస్తే విద్యార్థులకు పాఠశాల, కళాశాలల సమయాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను నడిపించేలా చూస్తామన్నారు. ఇందుకు చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి స్పందించి ప్రభుత్వం నుంచి కొత్త బస్సులు వచ్చిన వెంటనే తాండూరుకు మరిన్ని బస్సులు కేటాయించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అప్పటి వరకు డిపోలో ఉన్న బస్సులతో నే సమయానుకూలంగా బస్సులు నడిపించి సమస్యలు రాకుండా చూస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ఉన్నారు.
