రాజీవ్ కాలనీపై రాజకీయాలా..?
– యువతపై డ్రగ్స్ రాద్దాంతం తగదు
– వార్డు కౌన్సిలర్ మహమ్మద్ జావిద్
తాండూరు, దర్శని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీపై లేనిపోని విషయాలను జోడిస్తూ స్వార్థ రాజకీయాలు చేయడం మానుకోవాలని వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ మహమ్మద్ జావిద్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అఫ్పూ(నయూం) రాజీవ్ కాలనీ యువతపై డ్రగ్స్ ఆరోపణలు చేయడాన్ని ఆయన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. డ్రగ్స్, గంజాయి వ్యవహారాలకు కాలనీ యువతకు అసలేం సంబంధం లేదని కొట్టిపారేశారు. కాలనీ యువకులు వారి వారి సంప్రదాయాలను గౌరవిస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు.

బయటి వ్యక్తులు వచ్చి కాలనీలో అక్రమ, శాంతిభద్రతలకు విఘాతం చేస్తున్నారని గుర్తుచేశారు. ఇందులో కాలనీల వ్యక్తులకు, యువతకు సంబంధం లేదని అన్నారు. కాలనీలలో అన్నివర్గాల ప్రజలు సామరస్యంగా ఉంటున్నారని తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణపై అంత చిత్త శుద్ది ఉంటే బెల్టు దుకాణాలు, మద్యం దుకాణాలను మూసివేయించాలని అన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విషయంలో నిజాలు అవే బయటకు వస్తాయని అన్నారు. మీడియాలో వస్తున్న కథనాలను చూసి లేనిపోని నిందలు వేయడం మానుకోవాలని అన్నారు.


