రూ. 27 కోట్లతో మున్సిపల్ బడ్జెట్..!
– ఏకగ్రీవంగా ఆమోదించిన పాలకవర్గం
– ఆస్తిపన్నులపై రూ.10కోట్ల ఆధాయం అంచనా
– క్రమబద్దీరణపై రూ. 2 కోట్ల రాబడిపై ఆశలు
– మున్సిపల్ ఆధాయాన్ని పెంచేందుకు కృషి
– సమావేశంలో చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ వార్షిక బడ్జెట్‌ను రూ. 27 కోట్ల 51లక్షల 44లతో ప్రవేశ పెట్టగా పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.

బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో 2026-27 వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరం సవరణ అంచనా సాధారణ ఆధాయం రూ. 27కోట్ల 51లక్షల 44వేలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రూ. 10.29 లక్షల ప్రారంభ నిల్వతో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ని ఆమోదించడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్నుపై రూ. 10కోట్లు, స్టాంపు డ్యూటీ కింద రూ.1 కోటి, తై బజార్ కింద రూ. 5 లక్షలు, మున్సిపల్ దుకాణాల ద్వారారూ. 50 లక్షలు, ట్రేడ్ లైసెన్స్ స్పీచ్ ద్వారా రూ. 50 లక్షలు ఆధాయం వస్తుందని అంచనా వేశారు.

అదేవిధంగా పట్టణ ప్రణాళిక ద్వారా లే అవుట్ ఫీజులు, బిల్డింగ్ క్రమబద్దీకరణ ఫీజు ద్వారా మరో రూ. 2 కోట్ల 11 లక్షలు ఆధాయం వస్తుందని అంచనా వేశారు.
మున్సిపల్ ఆధాయం పెంపుకు కృషి : చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూర్ మున్సిపాలిటీలో ఆధాయం పెంపుకు కృషి చేయడం జరగుతుందని చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం పాలకవర్గ సభ్యులందరు సహకరించాలని కోరారు. ఆధాయం పెంపుతో ప్రజా సమస్యల పరిష్కారానికి అస్కారం దక్కుతుందని అన్నారు. మున్సిపల్ గ్రాంట్స్ తో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నిధులను కూడా తెచ్చుకుని అభివృద్ధి చేసుకుందామన్నారు. వీధి కుక్కల నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్ కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. శివారు ప్రాంతానికి కూడా మిషన్ భగీరథ తాగునీటి వ్యవస్థను తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పట్టణంలోని పార్కు స్థలాలను గుర్తించి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, డీఈ మణిపాల్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ దీప నర్సింలు, మేనేజర్ నరేందర్ రెడ్డి, అకౌంటెంట్లు వాణి, శివ కుమార్, ఏఈలు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, తదితరులుఉన్నారు.


