రామ మందిరానికి రూ. 1లక్ష 11వేల 111 విరాళం

తాండూరు రాజకీయం వికారాబాద్

రామ మందిరానికి రూ. 1లక్ష 11వేల 111 విరాళం
– అందజేసిన మురళీ గౌడ్‌ కుటుంబ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని శ్రీరామ మందిరానికి వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీ కృష్ణ గౌడ్ రూ. 1లక్ష 11వేల 111లను విరాళంగా అందజేశారు.

మూడు రోజలుగా ఇందిరానగర్‌ రామ మందిరంలో సీతారామ లక్ష్మణ హన్మంతుడి విగ్రహాల పున ప్రతిష్టాపనతో పాటు ధ్వజ స్థంభ ప్రతిష్టాపన ఉత్సవాలు జరుగుతున్నాయి. బుధవారం మురళీ కృష్ణ గౌడ్ దేవాలయానికి విరాళం అందజేశారు. మురళీకృష్ణ గౌడ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన తండ్రి నాగయ్య గౌడ్, కుమారుడు శ్రీవర్ధన్‌ గౌడ్‌లు దేవాలయ కమిటి సభ్యులకు విరాళం అందజేశారు. అంతకుముందు వారు దేవాలయంలో పునర్‌ ప్రతిష్టించిన సీతారాములను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, బీజేపీ కౌన్సిలర్ నాగారం మల్లేశం తదితరులు ఉన్నారు.

యువత వ్యాపార రంగంలో ఎదగాలి