కలుషిత నీటిపట్ల అప్రమత్తంగా ఉండాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

కలుషిత నీటిపట్ల అప్రమత్తంగా ఉండాలి
-ప్రజలకు ఉచిత తాగునీరు పంపిణీ అభినందనీయం
-తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పద్దోళ్ల దీపా సర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: కలుషిత నీటిపట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. తాండూరు పట్టణంలో మిషన్ భగీరథ పైపులైన్ పనుల అనుసంధాన నేపథ్యంలో పట్టణంలో తాగునీరు సరఫరా స్థంభించింది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఆదేశాల మేరకు పాత తాండూరులోని 17వ వార్డులో ఏకే వాటర్ ప్లాంట్ యజమాని, టీఆర్ఎస్ నాయకులు రాజన్ గౌడ్ ప్రజలకు ఉచితంగా మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శనివారం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నర్సింలు హాజరై నీటి పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొన్ని రొ జులుగా పాత తాండూరులో అతిసార విజృంబిస్తున్న నేపథ్యంలో ప్రజలందరు తాగునీటిపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అదె విధంగా పట్టణంలో మిషన్ భగీరథ పైపులైన్ పనుల అనుసంధానం వల్ల తాగునీరు నిలిచిపోవడంతో పాత తాండూరు వాసులకు ఉచితంగా తాగునీరు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సంజీవరావు. గుండప్ప, నాగు. వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.