బావనోళ్ల నర్సింలు యాదవ్ కు శ్రద్ధాంజలి
– దినకర్మలో పలువురు నివాళులు
– కుటుంబ సభ్యులకు పరామర్శ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, సాయిపుపుత్ర హోమ్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ బాబాయి(చిన్నాన్న) బావనోళ్ల నర్సింలు యాదవ్ కు శ్రద్ధాంజలి ఘటించారు.

గత నెల 28వ తేదీన అనారోగ్యంతో కన్నుమూశారు. సోమవారం తాండూరు మండలం చెంగోల్ గ్రామంలోని నివాసంలో నరసింహులు యాదవ్ దినకర్మ నిర్వహించారు. సందర్భంగా పలువురు నాయకులు, కిరాణా వ్యాపారులు, బంధుమిత్రులు హాజరై నర్సింలు యాదవ్ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.

అదేవిధంగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, బావనోళ్ల శంకర్ యాదవ్, బీసీ సంఘం రాజ్ కుమార్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మనోహర్ యాదవ్, మదనసింహారెడ్డి, బంటుమల్లప్ప, ప్రేమ్ రాజ్, జొన్నల వినోద్, మాజీ ఎంపీటీసీ గౌడి వెంకటేశం, బంటారం మాజీ ఎంపీపీ రాములు యాదవ్, మర్పల్లి నరసింహ యాదవ్, మల్లేష్ యాదవ్, కృష్ణ యాదవ్, అంతరం రాజు పటేల్, బి హనుమయ్య, బి కృష్ణయ్య, పలువురు బంధుమిత్రులు పాల్గొన్నారు.


