– బార్యకు 8 సార్లు అబార్షన్
దర్శిని బ్యూరో: మగపిల్లాడు కావాలని భార్యకు 8 సార్లు అబార్షన్ చేయించాడు ఓ నీచపు భర్త. విసిగివేజారిని భార్య చివరకు వేధింపులు తట్టుకోలేక అతడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముంబైకు చెందిన బాధిత మహిళకు 2007లో వివాహం కాగా 2009లో ఆమె మొదటి సారిగా ఆడశిశువుకు జన్మనిచ్చింది.
2011లో మరోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో తనకు వారసుడే కావాలంటూ భర్త అబార్షన్ చేయించాడు. ప్రీ ఇంప్లాంటేషన్, లింగ నిర్ధారణ తదితర అంశాలకు మన దేశంలో అనుమతి లేకపోవడంతో ఆమెను బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఎనిమిది సార్లు గర్భస్రావం చేయించాడు. చికిత్స, ఆయా పరీక్షల సమయంలో ఆమెకు 1,500కుపైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించాడు. ముంబయిలోని దాదర్ ప్రాంతంలో ఈ ఘటన జరగింది.
