కమ్యూనిటీ హాల్ శిలాఫలకం ధ్వంసం
– భగ్గుమన్న రాజ్‌పుత్ సమాజం సభ్యులు
– దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
– తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బొందిలి రాజ్ పుత్ సమాజంకు చెందిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం వేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

ఈ సంఘటనపై రాజ్‌పుత్ సమాజం సభ్యులు మండిపడ్డారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాండూరు పట్టణంలోని ఇందిరా నగర్ వార్డు నెంబర్ 5లో బీసీ కమ్యూనిటీ హాల్ నిమిత్తం బొందిలి రాజ్ పుత్ సమాజానికి స్థలం కేటాయించారు. హాల్ నిర్మాణం కోసం గతంలో మాజీ రవాణా శాఖ మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ చీప్ విఫ్ మహేందర్ రెడ్డి రూ. 5లక్షలు నిధులు కేటాయించారు.

ఆయన చేతుల మీదుగానే శిలాఫలకాన్ని ప్రారంభించారు. అయితే శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాజ్‌పుత్ సమాజం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. శిలాఫలాకాన్ని ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్ పుత్ సమాజం గౌరవాధ్యక్షులు ఠాకూర్ సుభాష్ సింగ్, అధ్యక్షులు ఠాకూర్ దిలీప్ సింగ్, ఉపాధ్యక్షులు ఠాకూర్ ఉమేష్ సింగ్, ట్రెజరర్ ఠాకూర్ ప్రతాప్ సింగ్, మాజీ అధ్యక్షులు ఠాకూర్ రమేష్ సింగ్, ఠాకూర్ ప్రభాకర్ సింగ్, ఠాకూర్ నర్సింగ్ సింగ్, ఠాకూర్ రాజు సింగ్, రాజపుత్ యూవదళ్ అధ్యక్షులు ఠాగూర్ దీపక్ సింగ్, ఠాకూర్ శివాజీ సింగ్ లు పాల్గొన్నారు.


