మమ్మేలూ.. కట్ట మైసమ్మా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మమ్మేలూ.. కట్ట మైసమ్మా..!
– వైభవంగా దేవాలయ వార్షికోత్సవం
– దర్శించుకున్న నేతలు, ప్రముఖులు
– భక్తులకు అన్నదానంలో పాల్గొన్న విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మమ్మేలూ.. కట్ట మైసమ్మా తల్లీ అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. బుధవారం తాండూరు పట్టణం ఆదర్శనగర్ లోని కట్ట మైసమ్మ దేవాలయంలో ఆలయ పునర్ నిర్మాణ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వినాయక గ్రూప్స్ అధినేత వర్త్యా విఠల్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.
kvcs
వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో అమ్మవారిని ప్రత్యేక పూజలు, అలంకరణలు చేశారు. అదేవిధంగా దేవాలయంలో హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డితో పాటు విఠల్ నాయక్, స్థానిక నాయకులు రజనీకాంత్, బంటు వేణుగోపాల్ ఆలయ కమిటి సభ్యులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో విఠల్ నాయక్ పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో వచ్చే దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటి అధ్యక్షులు సరేష్, ఉపాధ్యక్షులు నవీన్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, సభ్యులు పట్నం రమేష్, జుంటుపల్లి సుధాకర్, రాజేష్, టి. రాములు, సుధాకర్ మెకానిక్, పాపయ్య, బి. కృష్ణ, నర్సింలు, అంజిలయ్య, అలంపల్లి ప్రకాష్, అర్చకులు చంద్రకాంత్ స్వామి, మహిళ సభ్యులు లావణ్య, బ్రమరాంబ, వాంతి, లలిత, స్వాతి, దీప, దివ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

తెలంగాణ ధీర వనిత చాకలి ఐలమ్మ..!