వార్డు సమస్యల పరిష్కారానికి కృషి
– 6వ వార్డు కౌన్సిలర్ బోయ రవి
– కాలనీలో సమస్యలు తీరుస్తున్న కౌన్సిలర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ పరిధి 6 వ వార్డు కౌన్సిలర్ బోయ రవి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ కాలనీలో ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా దృష్టిసారించడం జరుగుతుందన్నారు. అర్హులైన పేదలకు, వృద్ధులకు అసరా ఫించన్లు, పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మీ చెక్కులు వంటి పథకాలను ప్రభుత్వం, అధికారులు, నేతల సహాకారంతో అమలకు ప్రాధాన్యమివ్వడం జరుగుతుందన్నారు. దీంతో పాటు పారిశుద్ధ్యంపై దష్టిసారించి మురుగుకాలువల, వీధుల పరిశుభ్రత పాటించేలా చూడడం జరుగుతుందన్నారు. కాలనీలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ లీకేజీలను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయించడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారిస్తానని వారు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అందరి సహాకారంతో వార్డులో అభివృద్ధి పనులను కూడ వేగవంతం చేయిస్తామని పేర్కొన్నారు.
పట్నం ఇంటికి పైలెట్..!
– ఆసక్తికరంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కలయిక
– ఇరువర్గాలలో జోరుగా చర్చలు
– రాజకీయ పరిణాలపై మాటామంతి
https://dharshininews.com/17369


