తాగునీటి విషయంలో ఇబ్బందులు రావొద్దు
– పైపులైన్ మరమ్మత్తులను త్వరగా పూర్తి చేయండి
-భగీరథ అనుసంధాన పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రజలకు తాగునీరు విషయంలో.. సరఫరాలో ఇబ్బందులు, సమస్యలు రాకుండా దృష్టిసారించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరును ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సందర్శించారు. రెండు రోజుల క్రితం పాత తాండూరులో అతిసార కేసులు నమోదుకావడంతో పైపులైన్ లీకేజీలకు మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు.
ఇందులో భాగంగా పొత తాండూరులో లీకేజీలకు మరమ్మత్తులు చేపట్టిన ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. కాగ్నా వాగు మార్గంలో పైపులైన్లకు మరమ్మత్తులు చేపట్టి ఆదివారంలోగా తాగునీటి సరఫరాను పునరుద్దించాలని ఆదేశించారు. మరోవైపు పాత తాండూరులో అతిసార నేపథ్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కూడ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సందర్శించి వైద్య సేవలపై ఆరాతీశారు. బాధితులను గుర్తిస్తే వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. స్థానికంగా అంబులెన్సును ఏర్పాటు చేయాని జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ కు సూచించారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు, యువకులు తదితరులు ఉన్నారు.

