ప్రేమ పేరుతో బాలికను ట్రాప్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రేమ పేరుతో బాలికను ట్రాప్..!
– మైనర్‌ను అపహరించేందుకు యత్నం
– పట్టుకొచ్చిన తాండూరు పోలీసులు
– ఢిల్లీకి చెందిన నిందితుడిపై కేసు నమోదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఢిల్లీ నుంచి వలస వచ్చిన ఓ యువకుడు ప్రేమ పేరుతో మైనర్ బాలికను ట్రాప్‌ చేశాడు. ఆమెను ఎత్తుకెళ్లేందుకు యత్నిస్తుండగా తాండూరు పోలీసులు నిందితున్ని పట్టుకుని కేసు నమోదు చేశారు.

ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ బొంగు పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఢీల్లీ ప్రాంతానికి చెందిన ఆదీమ్(28) అనే యువకుడు తాండూరు పట్టణానికి పనికోసం వచ్చాడు. ఆరు నెలలుగా పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఢిల్లీ సెలూన్‌ షాపులో కటింగ్ పనులు చేస్తూ… సమీప కాలనీలో అద్దెకు ఉంటున్నాడు.

అదే ప్రాంతంలో ఉంటున్న 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో వల వేశాడు. మాయ మాటలు చెప్పి.. ఢిల్లీకి తీసుకెళ్లేందుకు యత్నించాడు. శనివారం ఉదయం నిందితుడు బాలికను హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి బాలికను ఢిల్లీ తీసుకవెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నాడు. బాలిక కుటుంబ సభ్యులు తాండూరు పోలీసులను ఆశ్రయించి నిందితుడిపై ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పోలీసుల బృందం హైదరాబాద్‌ వెళ్లి నిందితుడు ఆదీమ్, బాలికను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్టేషన్‌కు తరలించారు. దీంతో నిందితుడిపై మైనర్‌ బాలికను కిడ్నాప్‌ కేసు నమోదు చేయడం జరిగిందని పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు.

బైకును ఢీ కొట్టిన ఇసుక ట్రాక్టర్