బాలికపై యువకుడి అత్యాచారం
– బషీరాబాద్ మండలంలో దారుణం
– కేసు నమోదు చేసిన పోలీసులు
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : బాలిక పట్ల ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను పాడుబడిన ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ దారుణమైన సంఘటన బషీరాబాద్ మండలంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక నాన్నమ్మ ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన రమణి నరేష్(25) అనే యువకుడు కన్నేశాడు.

కామంతో కోరికను తీర్చుకునేందుకు బాలికను ఒక పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబీకులు బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ తెలిపారు.

మరోవైపు బాలికను పరీక్షల నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన బషీరాబాద్ మండలంలో కలకలం రేపింది.


