పాపం.. భారతవ్వ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పాపం.. భారతవ్వ..!
– మురుగు కాలువలో పడిన వృద్ధురాలు
– ఒకరోజు మొత్తం అందులోనే
తాండూరు, దర్శిని ప్రతినిధి : దాదాపు 70 ఏండ్ల వృద్ధురాలు.. అనుకోకుండా మురుగుకాలువలో పడిపోయింది. 24 గంటలకు పైగా అందులోనే కాలం వెల్లదీసి ఉంది. పాపం అనిపించిన ఈ సంఘటన తాండూరు పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పరిగి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తాండూరు పట్టణానికి వచ్చి హైదరాబాద్ రోడ్డు మార్గం: గీతా మందిర్ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరింట్లో సుమారు 75 ఏండ్లు ఉన్న భారతమ్మ అనే వృద్ధురాలు ఉంటోంది. ఈమెకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో పాటు పక్షవాతం కూడా ఉన్నట్లు కుటుంభీకులు తెలిపారు.

అయితే ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వృద్ధురాలు ఇటీవల ఇంటి సమీపంలో నిర్మించిన భారీ మురుగు కాలువలో ప్రమాద వశాత్తు పడిపోయింది. కొద్ది సేపటి తరువాత ఇంట్లో వాళ్లు ఆమె ఆచూకీకోసం వెతికిన ఫలితం లేకుండా పోయింది. సోమవారం మధ్యాహ్నం తరువాత అనుమానం వచ్చి ఇంటి సమీపంలోని మురుగు కాలువలో చూశారు. భారతమ్మ అందులో కనిపించడంతో పోలీసులకు, మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు.

మున్సిపల్ కార్మికులు భారతమ్మను కాలువలో నుంచి బయటకు తీసుకవచ్చారు. దీంతో కుటుంభీకులు ఆమెను సమీపంలో ఉన్న ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. మురుగు కాలువలో పడిపోయిన వృద్ధురాలు దాదాపు 24 గంటలకు పైగా అందులోనే గడిపింది. ఈ విషయం తెలిసిన స్థానికులు పాపం భారతవ్వ అంటూ విచారం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..