జిల్లాలో స్కూళ్లకు సెలవు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జిల్లాలో స్కూళ్లకు సెలవు..!
– కలెక్టర్ ఆదేశాలతో ప్రకటన
– ఉత్తర్వులు జారీ చేసిన డీఈఓ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విద్యాధికారి రేణుకా దేవి ఉత్తర్వులు జారీ చేశారు.

మెంథా తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ విషయాన్ని పిఆర్టీయూ నాయకులు, యాలాల మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకవెళ్లినట్లు ఆయన తెలిపారు. దీంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు తెలిపారు.
kvcs
ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా విద్యాధికారికి ఆదేశాలు జారీ చేయగా.. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా బుధవారం సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉత్తర్వులను జారీ చేశారు. అయితే ఉత్తర్వులు వెలువడక ముందే విద్యార్థులు పాఠశాలలకు తడుస్తూనే వెళ్లిపోయారు. తీరా ఉత్తర్వులు రావడంతో తిరిగి ఇంటికి చేరుకునేందుకు కూడా ఇబ్బందులు పడ్డారు.

ఇదికూడా చదవండి…

బ్యాంకుకే బురిడి కొట్టే స్కెచ్..!