కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం
– మంత్రులు, ఎంపీలు ఉన్నా దక్కని వాటా
– యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రా నికి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రానికి దక్కాల్సిన హక్కులు, వాటాలు, నిధులలో అసంతృప్తికి గురిచేసిందన్నారు.
తెలంగాణ సమస్యలు, అభివృద్ధి అంశాలను పూర్తిగా విస్మరించిందన్నారు. తెలంగాణ నుంచి బీజేపీ తరుపున ఇద్దరు కేంద్ర మంత్రులు, 6 మంది ఎంపీలు ఉన్నా లాభం లేకుండా పోయిందని విమర్శించారు. బీజేపీ వల్ల తెలంగాణకు ద్రోహం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రానికి తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అనిల్, వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్, తాండూరు మండల అధ్యక్షులు సుధాకర్, పెద్దేముల్ మండల అధ్యక్షులు మహేష్, బషీరాబాద్ మండల అధ్యక్షులు సతీష్, అల్తాఫ్, ఎన్ఎస్ యూఐ అధ్యక్షులు ప్రేమ్, రవి, రఫీక్, రామకృష్ణ, ప్రవీణ్, చరణ్, హరీష్ గౌడ్, సునీల్, సుధీర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

