పార్కుల సుందీక‌ర‌ణ‌కు కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

పార్కుల సుందీక‌ర‌ణ‌కు కృషి
– మున్సిపల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు పట్ట‌ణంలోని పార్కుల సుందీక‌ర‌ణ‌పై దృష్టి సారించ‌డం జ‌రుగుతుంద‌ని మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ పేర్కొన్నారు. ఆదివారం తాండూరు మున్సిప‌ల్ ప‌రిధి ఇందిరా న‌గ‌ర్‌లోని పార్కులో చేప‌ట్టే అభివృద్ది ప‌నుల‌ను 6వ వార్డు కౌన్సిల‌ర్ బోయ‌ర‌వితో క‌లిసి చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ పార్కులో వాకింగ్ ట్రాక్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు అభివృద్ధి ప‌రుస్తామ‌న్నారు. ఇట్టి ప‌నుల‌ను నాణ్య‌త‌తో చేప‌ట్టాల‌ని కాంట్రాక్టర్‌ను అదేశించ‌డం జ‌రిగింద‌న్నారు. అదేవిధంగా ప‌ట్ట‌ణంలోని అన్ని పార్కులలో వ‌సతులు ఏర్పాటు చేసి సుంద‌రీక‌ర‌ణ చేసేందుకు దృష్టి సారిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ ఫ్లోర్ లీడ‌ర్, కౌన్సిల‌ర్ అబ్దుల్ రజాక్, కౌన్సిల‌ర్ వెంకన్న గౌడ్, వార్డు పెద్ద‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.