పట్టణ రోడ్లకు మహర్ధశ
– రోడ్డు పనులు ప్రారంభంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో చేపట్టాల్సిన రోడ్లపనులు పూర్తి చేసి మహర్దశ తీసుకవస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయం ముందు శాంత్ మహాల్ చౌరస్తా వరకు చేపడుతున్న సీసీ రోడ్డు పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ తాండూరు పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న భావిగి భద్రేశ్వరాలయం ముందు రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. పట్టణంలోని అన్ని చోట్ల చేపట్టాల్సిన రోడ్డు పనులను పూర్తి చేయించి అట్టి రోడ్లకు మహర్దశ తీసుకువస్తామన్నారు. అంతకుముందు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, కౌన్సిలర్లు భావిగి భద్రేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ శోభారాణి, సింధూజ గౌడ్, వార్డు కౌన్సిలర్ బంటారం లావణ్య, మాజీ ఫ్లోర్ లీడర్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, ముక్తార్ నాజ్, వెంకన్న గౌడ్, బోయ రవి రాజు, మంకల్ రాఘవేందర్, టీఆర్ఎస్ నాయకులు ఎర్రం శ్రీధర్, బీజేపీ నాయకులు బంటారం భద్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
