ఆరోగ్యానికి ఆర్థిక చేయూత సీఎంఆర్ఎఫ్

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఆరోగ్యానికి ఆర్థిక చేయూత సీఎంఆర్ఎఫ్
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ పథకం ఆర్థిక చేయూతనందిస్తుందని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. తాండూరు పట్టణానికి చెందిన ఫిరోజ్ ఖాన్, నహీదా భేగంలకు సీఎంఆర్ఎఫ్ కింద నిధులు మంజూరయ్యాయి.
ఇందుకు సంబంధించిన ఎల్ఓసీలను తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో ఎంతో మంది పేదలు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక లబ్దిపొందారని అన్నారు. అనారోగ్యంతో బాధపడే వారికి కార్పోరేట్ వైద్యం అందేలా కేసీఆర్ సర్కారు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక చేయూతనందిస్తుందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, నాయకులు సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.