ఎల్ల‌మ్మ త‌ల్లిని ద‌ర్శించుకున్న శుభ‌ప్ర‌ద్ ప‌టేల్

తాండూరు వికారాబాద్

ఎల్ల‌మ్మ త‌ల్లిని ద‌ర్శించుకున్న శుభ‌ప్ర‌ద్ ప‌టేల్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంలోని నెహ్రు గంజ్‌లో వెల‌సిన శ్రీ రేణుకా నాగ ఎల్ల‌మ్మ‌ను తెలంగాణ రాష్ట్ర బీసీ క‌మీష‌న‌ర్ మెంబ‌ర్ శుభ‌ప్ర‌ద్ ప‌టేల్ ద‌ర్శించుకున్నారు. శుక్ర‌వారం రేణుకా ఎల్ల‌మ్మ జాత‌ర ఉత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. జాత‌ర ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని శుభ‌ప్ర‌ద్ ప‌టేల్ గంజ్ ఎల్ల‌మ్మ దేవాల‌యానికి వ‌చ్చారు. ఆల‌యంలో వెల‌సిన శ్రీ రేణుకా ఎల్ల‌మ్మ‌ను బీసీ క‌మీష‌న్ మెంబ‌ర్ శుభ‌ప్ర‌ద్ ప‌టేల్ వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ వైస్ చైర్మ‌న్ బైండ్ల విజ‌య్ కుమార్‌తో క‌లిసి ద‌ర్శించుకున్నారు. అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌ను, భ‌క్తుల‌ను స‌ల్లంగా చూడాల‌ని వేడుకున్నారు. ఆయ‌న వెంట బీసీ సంక్షేమ సంఘం తాండూరు క‌న్విన‌ర్ కందుకూరి రాజ్ కుమార్, స‌య్య‌ద్ షుకూర్, నాయ‌కులు ల‌క్ష్మ‌ణ్, దావుల‌య్య‌, ఉద్య‌మ కారులు జిలాని, భాను, హ‌మాలి కార్మికులు త‌దిత‌రులు ఉన్నారు.