పెళ్లికి వెళ్లిన ఇంటి తాళాలు ధ్వంసం..!
– దొంగతనం ఫిర్యాదుపై అయోమయం
– చివరికి పోలీస్టేషన్ వెళ్లిన బాధితుడు
– లాస్ట్‌లో ఊహించని ట్విస్ట్..?
– తాండూరు పట్టణంలో సంఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: పెళ్లికి వెళ్లిన వారి ఇంటి తాళాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలిసిన బాధుతులు హతాశయానికి గురయ్యారు. జరిగిన సంఘటనపై పోలీస్టేషన్‌కు వెళితే.. తమ పరిధి కాదు.. మరో పోలీస్టేషన్‌కు వెళ్లాలనే అధికారుల సూచనతో అయోమయంకు గురయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణకు సిద్దమవుతుండగా చివర్లో పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. పట్టణంలోని భవానీ ఫంక్షన్ హాల్ సమీపంలోని బసవ నగర్లో కల్లూరు విశ్వనాథం కాంట్రాక్టు మేస్త్రీ సూపర్ వైజర్ పనులు చేయిస్తుంటాడు. శనివారం షాద్‌నగర్‌లో బందువుల పెళ్లికని బయల్దేరారు. అలా పెళ్లికి వెళ్లగానే గుర్తుతెలియని వ్యక్తులు అతని ఇంటి తాళాలను ధ్వంసం చేశారు. స్థానికుల అనుమానంతో విషయం తెలుసుకున్న విశ్వనాధం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళంతో పాటు ఇంట్లోని బీరుతా తాళం ధ్వంసమై ఉండడాన్ని గమనించారు. వెంటనే అయోమయానికి గురై ఇంట్లో రూ. 40 వేలతో పాటు బంగారం అపరణకు గురైనట్లు అనుమానంతో తాండూరు పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే చోరీ జరిగిన సంఘటన స్థలం గౌతాపూర్ పోలీస్టేషన్ పరిధికి వస్తుందని, అక్కడ ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించినట్లు సమాచారం. దీంతో గౌతాపూర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అక్కడా కూడా అదే సమాధానం రావడంతో డీఎస్పీ శేఖర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో పట్టణ పోలీసులు విచారణకు సిద్దమయ్యారు.
తీరా విచారణ చేపట్టేందుకు చర్యలు చేపడుతుండగా బాధితుడు పోలీస్టేషన్‌కు వచ్చి ఇంట్లో చోరీ జరగలేదని, డబ్బులు ఇంట్లో ఉన్నాయని బాధితుడు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ట్విస్ట్‌తో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. విషయం తెలిసిన ప్రజలు కూడా ఈ సంఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి…

