పోలీస్ శాఖపై నమ్మకం పెంచాలి

క్రైం తాండూరు వికారాబాద్

పోలీస్ శాఖపై నమ్మకం పెంచాలి

– విధుల పట్ల నిర్లక్ష్యం చేయరాదు

– వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ

వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం పెంచాలని, పోలీసులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నారాయణ పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు ఫంక్షనల్ వర్టికల్స్ లలో ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. పోలీస్ స్టేషన్లలో అందరూ 5ఎస్ పద్దతిని పాటించాలని.. వర్టికల్స్ నిర్వహణలో ఏవరైనా నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన  చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

100కు వచ్చిన  ఫిర్యాదులకు వెంటనే స్పందించి పోలీస్ శాఖ పైన వారికి మరింత నమ్మకం కల్పించాలన్నారు.  పోలీస్ శాఖ తమవెంట ఉందనే ధైర్యాన్ని కల్పించాలని అన్నారు. కేసుల వివరాలను ఆన్లైన్ లో ఎప్పటికప్పుడుుుు నమోదు చేయాలని సూచించారు.  కేసులను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పూర్తి చేసి ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలని అన్నారు. జిల్లా లోని సర్కిల్ ఇనుస్పెక్టర్, డీఎప్సీలు తమ పరిధి లోని పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశంలు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ లలో నమోదు అయిన కేసులలో పురోగతి సాధించి  నేరస్థులకు శిక్షలు పడేవిధంగా చేయాలని చూడాలన్నారు. ఈ పెట్టి కేసులు, ఈ-చాలన్ల పై దృష్టి సారించాలని అన్నారు. ప్రజలకు సి‌సి‌టి‌విలపై అవగాహన కల్పించాలని, ప్రజలకు కళాజాత బృందం, షీ టీమ్ ల ద్వారా డయల్ 100, మహిళలపై జరిగే నేరాల గురించి అవగాహన, మూడనమ్మకాలు, రైతు ఆత్మహత్యలు తదితర విషయాల పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు.

ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్‌.పి శ్రీ ఎం.ఏ రశీద్ గారు, వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు, తాండూరు డీఎస్పీ లక్ష్మినారాయణ, జిల్లా సర్కిల్ ఇనుస్పెక్టర్లు, ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.